సమగ్ర శిక్ష విద్యాప్రవేశ్ -90 రోజుల కార్యక్రమం
జిల్లాలోని ఎంఈఓ లకు /హెడ్మాస్టర్లకు /డిఆర్పి లకు /కేఆర్పి లకు తెలియజేయునది.
రాష్ట్రంలో విద్యా ప్రవేశ్ కార్యక్రమం అమలుపై నిన్న సమగ్ర శిక్ష రాష్ట్ర స్థాయి అధికారులు సమీక్ష నిర్వహించారు.
To join My Telegram Channel Click here
Get FREE Teachers Related News and Job Alerts Directly on WhatsApp Click here
Facebook Click here
🌱సమావేశంలోని ముఖ్య అంశాలు.🌱
📌 విద్యాప్రవేశ్ అనేది ఒక పాఠశాల సంసిద్ధత కార్యక్రమం.
📌 పూర్వ ప్రాథమిక విద్యను ముగించుకొని ఒకటవ తరగతిలో చేరుతున్న విద్యార్థుల సామర్ధ్యాల అంచనా మరియు అభ్యసన సామర్ధ్యాల పెంపు కొరకు చేపట్టిన కార్యక్రమం *విద్యా ప్రవేశ్* .
📌 ఈ కార్యక్రమాన్ని జిల్లాలో రేపటినుండి అనగా 13.06.2024 నుండి 90 రోజులు పాటు నిర్వహించాలి .
📌90 రోజుల కార్యక్రమానికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను పిడిఎఫ్ రూపంలో పంపించడం జరుగుచున్నది. ప్రతిరోజు భాషాభివృద్ధి జ్ఞానాభివృద్ధి మరియు శారీరక అభివృద్ధికి సంబంధించి న మూడు కృత్యాలను విద్యార్థులచే సంబంధిత ఉపాధ్యాయులు చేయించవలెను. దీని కొరకు ప్రతిరోజు రెండు గంటల సమయాన్ని కేటాయించాలి.
📌 ఈనెల 18వ తేదీ నుండి 21వ తేదీ వరకు NCERT, SCERT, సమగ్ర శిక్ష మొదలగు డిపార్ట్మెంట్లోని అధికారుల యొక్క టీం జిల్లాలో పర్యటించి విద్యాప్రవేశ్ కు సంబంధించిన బేస్ లైన్ పరీక్షను నిర్వహిస్తారు. బేస్ లైన్ పరీక్ష నిర్వహించే శాంపిల్స్ స్కూల్స్ వివరాలు ముందుగా ఎవరికీ తెలియజేయరు. జిల్లాలో ఏ ప్రాథమిక పాఠశాలలో నైనా ఈ సర్వే నిర్వహించే అవకాశం ఉన్నది గనుక అందరూ అప్రమత్తంగా ఉండవలెను.
📌 విద్యాప్రవేశ్ కార్యక్రమాలు అమలుపై ప్రతివారం గౌరవ డీఈవో గారు సమీక్ష నిర్వహిస్తారు. సంబంధిత రిపోర్టును ఎంఈఓ లు జిల్లా సమగ్ర శిక్ష కార్యాలయానికి పంపవలసి ఉంటుంది.
📌FLN 60 డేస్ కోర్స్ లో శిక్షణ పొందిన డిఆర్పీలు ఖచ్చితంగా వారి పాఠశాలల్లో ఒకటి రెండు తరగతులను ఖచ్చితముగా బోధించాలి.
📌 టీచింగ్ అట్ ది రైట్ లెవెల్ లో శిక్షణ పొందిన డిఆర్పీలు కచ్చితంగా మూడు నాలుగు ఐదు తరగతులకు బోధించాలి.
📌 విద్యా ప్రవేశ కార్యక్రమాల అమలు కు వీడియో మరియు డాక్యుమెంటేషన్ ను జిల్లా కార్యాలయానికి ప్రతివారం పంపవలెను.
📌90 రోజుల తర్వాత ENDLINE పరీక్షను నిర్వహించడం జరుగుతుంది.
🌱 మండల విద్యాశాఖ అధికారులు, సి ఆర్ సి హెడ్మాస్టర్లు, FLN KRP లు /DRPs ఈ కార్యక్రమం యొక్క అమలును మానిటరింగ్ చేయవలెను.
🌱 దీనికి సంబంధించిన ప్రొసీడింగ్స్ త్వరలో పంపించడం జరుగుతుంది.
🌱 జిల్లాస్థాయిలో ఈ కార్యక్రమం అమలులో సందేహాలు ఉన్నట్లయితే
జిల్లా అకడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ / అసిస్టెంట్ అకడమిక్ మోనిటరింగ్ ఆఫీసర్, సమగ్ర శిక్ష తిరుపతి వారిని సంప్రదించవచ్చు.
సమగ్ర శిక్ష విద్యాప్రవేశ్ -90 రోజుల కార్యక్రమం pdf Download
Download Vidya Pravesh Handbook
How to Analyse the Enrollment Drive
0 comments:
Post a Comment